వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు కాశిబుగ్గ, వెంకట్రామ కూడలిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనుమానం వచ్చిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు. ఇంతేజార్ గంజ్ పరిధిలోని కూడళ్ళలో స్పెషల్ పార్టీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ