ETV Bharat / state

రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళ... భౌతికదూరం వెలవెల

లాక్‌డౌన్‌ సడలింపులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరుగుతోంది. కొనుగోళ్లు, అమ్మకాలకు వచ్చేవారితో సందడి నెలకొంటుంది. కానీ బారులు తీరిన జనం భౌతిక దూరం పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

physical-distance-not-followed-in-registration-office-at-warangal
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళ... భౌతికదూరం వెలవెల
author img

By

Published : May 14, 2020, 12:20 PM IST

Updated : May 14, 2020, 6:04 PM IST

లాక్‌డాన్ కొనసాగిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకుండా ఇచ్చిన సడలింపులతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మళ్లీ సందడి నెలకొంటోంది. రిజిస్ట్రేషన్, ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల్లో క్రమంగా కార్యకలాపాలు జోరందుకున్నాయి. రిజిస్టేషన్లు చేసుకోవడానికి కార్యాలయాల్లో జనం బారులు తీరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత మూడు రోజులుగా రద్దీ పెరుగుతోంది. సుమారు 450 రిజిస్ట్రేషన్లు జరగగా... దాదాపు 80 నుంచి 85 లక్షల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.

ఇబ్బంది పడినా...

లాక్‌డౌన్‌తో ఆరంభంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొంత ఇబ్బందిపడినా... మళ్లీ పుంజుకుంటుందని వ్యాపారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 15 నుంచి నెలరోజుల్లో విక్రయాలు జోరందుకుంటాయని ఆకాంక్షిస్తున్నారు.

మాస్కులు లేకుంటే నో ఎంట్రీ...

కార్యాలయంలోకి మాస్కులులేనిదే ఎవరినీ అనుమతించట్లేదు. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మాస్కులు ఉన్నా సరే భౌతిక దూరం కరువు అవుతుంది. రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరగుతుందని.. అందుకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.

రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి: 'అవసరమైతే ఈ-మెయిల్​లో సెన్సార్​ జారీ చేస్తాం'

Last Updated : May 14, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.