'కళ్ల ముందే మా వాళ్లు గల్లంతై పోయారు' వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లిన 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. హన్మకొండలోని మ్యాక్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తమ ఆత్మీయుల్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ జాకెట్లు ధరించి ఉంటే కొంత మంది బయటపడేవారన్నారు. ప్రమాదం అని తెలిసినా... బోటు నిర్వాహకులు అజాగ్రత్తగా ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని వాపోయారు.
ఇదీ చూడండి : తెలంగాణ భవన్లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్