ETV Bharat / state

'సేంద్రీయ పంటల వైపు దృష్టి సారించండి'

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో.. బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ పంటల ఉత్పత్తుల మేళకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు.

organic crops
సేంద్రీయ పంటలు
author img

By

Published : Mar 28, 2021, 3:18 PM IST

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​ పేర్కొన్నారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల పంటలు కలుషితం అవుతున్నాయన్నారు. వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో.. బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ పంటల ఉత్పత్తుల మేళాకు ఆయన హాజరయ్యారు.

ప్రస్తుత కాలంలో.. ప్రజలు సేంద్రీయ కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు ఎమ్మెల్యే. రైతులు.. ఆ విషయాన్ని గమనించి, సేంద్రీయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. రైతన్నలకు.. సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు మొదలగు వాటి ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్న బాల వికాస సంస్థను ఆయన కొనియాడారు.

ఈ మేళాలో.. సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన పలు రకాల.. బియ్యం, పప్పులు, కూరగాయలు, కారం, పసుపు మొదలగు వాటిని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలి: జాతీయ బంజారా మిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.