ETV Bharat / state

ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్​ను వెనక్కి తీసుకోవాలని అన్నదాతల ఆందోళన - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూసమీకరణ నోటిఫికేషన్‌పై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్‌ నిలివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించినా... అన్నదాతలు సంతృప్తి చెందట్లేదు. ఎక్కడికిక్కడే రోడ్లపైకి చేరి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్‌పూలింగ్ నోటిఫికేషన్​ను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు తేల్చిచెబుచున్నారు.

రైతుల ఆందోళనలు
రైతుల ఆందోళనలు
author img

By

Published : May 24, 2022, 7:23 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూసమీకరణ నోటిఫికేషన్‌పై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలో 41 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి తీసుకోవాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ నిర్ణయించింది. రెండు జిల్లాల్లోనూ 8 మండలాల్లోని 28 గ్రామాల పరిధిలోని 22 వేల 749 ఎకరాల భూములను సేకరించాలని గతంలో జీవో విడదల చేసింది. ఆ జీవోను నిరసిస్తూ వివిధ గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు.

రెండు పంటలు పండే భూములిచ్చేది లేదంటూ పలు గ్రామాల్లో అన్నదాతలు రోడెక్కారు. జిల్లా కలెక్టరేట్లు ముఖ్య కూడళ్లలో రాస్తోరోకోలు నిర్వహించారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన కుడా అధికారులు ల్యాండ్ పూలింగ్‌ నిలివేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో జారీ చేయకపోవడంతో వారు మరోసారి ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులపై తమదైన రీతిలో ఒత్తిడి పెంచుతున్నారు.

ఐనవోలు మండలం పున్నేలులో అభివృద్ధి పనుల కోసం వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను అడ్డుకున్నారు. రింగ్‌ రోడ్‌ వల్ల జీవనాధారమైన భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్‌పూలింగ్‌ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా జీవో జారీలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు సద్దుమణిగాక మళ్లీ భూసమీకరణకు ప్రయత్నాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే వరకు పోరాటం ఆపేదిలేదని రైతులు తేల్చిచెబుతున్నారు.

ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్​ను వెనక్కి తీసుకోవాలని అన్నదాతల ఆందోళన

"మా తాతల కాలం నుంచి భూములు ఇవి. సంవత్సరంలో రెండు, మూడు పంటలు పండుతాయి. కచ్చితంగా జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే వరకు పోరాటం ఆపేదిలేదు." -పెద్దన్న రైతు ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు

ఇదీ చదవండి: ఏపీ పనులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి.: కేఆర్‌ఎంబీకి ఈఎన్‌సీ లేఖ

చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల.. తల్లి వానరం ఏం చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.