ETV Bharat / state

ఉచిత సిలిండర్​ ఇస్తానని నమ్మించాడు.. వృద్ధురాలి బంగారం దోచేశాడు... - Telangana crime news

old woman was robbed of gold in Hanmakonda: ఉచిత సిలిండర్​ ఇస్తామంటూ.. లేని పోని మాయ మాటలు చెప్పి అమాయకమైన వృద్ధురాలి బంగారు తాడును అపహరించిన సంఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

బంగారం చోరీ
బంగారం చోరీ
author img

By

Published : Apr 2, 2023, 6:54 PM IST

Updated : Apr 2, 2023, 7:03 PM IST

old woman was robbed of gold in Hanmakonda: పల్లెల్లో వృద్ధుల అమాయకత్వమే నేరగాళ్లకు ఓ వరం. అప్పుడప్పుడు గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు వచ్చి.. మీకు ఆఫర్​ తగిలింది... ఫలానా వస్తువు మీకు ఉచితంగా వస్తుందని.. మీ దగ్గరున్న సరుకును మార్కెట్​ ధర కంటే ఎక్కువ ధరకు తీసుకుంటాం.. అనో మభ్యపెడుతుంటారు. మీ ఊరి ఫలానా వ్యక్తి తెలుసంటూ బుకాయిస్తుంటారు.

నమ్మకం కలిగే విధంగా కల్లబొల్లి మాటలతో ఊరిస్తారు. పల్లెల్లోని అమాయకులు, వృద్ధులు వారిని నిజంగానే నమ్మి వారు చెప్పినట్లు చేస్తుంటారు. సదరు వ్యక్తి బురిడి కొట్టిస్తున్నాడని తెలుసుకునేలోపు జరగాల్సిన మోసం జరిగిపోతుంది. ఇలాంటి మోసమే హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. లేని పోని మాయ మాటలు చెప్పి అమాయకమైన వృద్ధురాలి మెడలోంచి చెప్పి రెండున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి భాగ్యమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి .. మీకు ఉచితంగా కొత్త గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఊరించాడు. హనుమకొండలో ఉంటున్న ఆమె కుమారుడు తనకు తెలుసని వృద్ధురాలు నమ్మే విధంగా మాయ మాటలు చెప్పాడు.

ఉచితంగా గ్యాస్​ సిలిండర్​ కావాలంటే ఫోటోలు అవసరం అవుతాయని అన్నాడు. వంటింట్లో ఉన్న ఆమెను.. ఫోటోలు స్పష్టంగా రావాలంటే ఇంట్లో చీకటిగా ఉందని వాకిట్లోకి రమ్మని పిలిచి.. పేదరాలిగా కనిపించాలంటే మెడలో ఉన్న బంగారు తాడు ఫోటోలో కనిపించొద్దని.. బంగారు తాడు తీసి పక్కన పెట్టాలని భాగ్యమ్మను నమ్మించాడు.

సదరు వ్యక్తి మాటలను నమ్మిన వృద్ధురాలు బంగారు తాడు తీసి పక్కన ఉన్న అరుగుపై పెట్టి గ్యాస్ స్టవ్​ను తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన క్రమంలో నిందితుడు రెండున్నర తులాల బంగారంతో పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

"ఉదయమే ఎనిమిది గంటల ప్రాంతంలో ఉచితంగా సిలిండర్​ ఇస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. హనుమకొండలో ఉన్న మా కొడుకు తెలుసని నమ్మించాడు. ఉచిత సిలిండర్​ కోసం ఫోటోలు కావాలని చెప్పి.. మెడలో ఉన్న తాడు తీయమని చెప్పాడు. నేను తాడు తీసి అరుగుపైన పెట్టాను. ఇంట్లో ఉన్న గ్యాస్​ స్టవ్​ తీసుకురమ్మని చెప్పి.. నేను ఇంట్లోకి వెళ్లాక బంగారంతో పరారయ్యాడు." - బాధితురాలు

ఇవీ చదవండి:

Last Updated : Apr 2, 2023, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.