KTR Fire On BJP And Congress Leaders In Warangal : ధరలు పెంచే మోదీ.. పిరమైన ప్రధాని అంటూ.. రూ.1200కు గ్యాస్ ధరను పెంచిన వారిని ఏం చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల మీద విరుచుకుపడ్డారు.
నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.లక్ష వేస్తానని 9ఏళ్ల క్రితం మోదీ అన్నారు.. కానీ ఈనాడు ఒక్కరికైనా ప్రధాని ఇచ్చిన డబ్బు అందిందా అని వరంగల్ ప్రజానికాన్ని ప్రశ్నించారు. బీజేపీకు అసలు ఏదీ చేత కాదు.. వచ్చిందల్లా ఒక్కటే మత కల్లోలాలు సృష్టించడం మాత్రమేనని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఏం సాధించారని.. తిరిగి అన్ని నోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయని ఎద్దేవా చేశారు. పనికి మాలిన మాటలు తప్ప పనికొచ్చే పని మోదీ సర్కార్ ఎప్పుడూ చేయలేదని ధ్వజమెత్తారు.
BRS Public Meeting In Warangal : నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి.. గ్యాస్ రూ.1200కు పెంచారు.. అన్ని వస్తువుల ధరలు పెరిగాయని మరిప్పుడు మోదీకి తిరుగులేని విధంగా ప్రజలే బుద్ధి చెప్పాలని హితవు పలికారు. రూ. 200 పింఛన్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. రూ.2000 ఇచ్చే బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పారు. రాబంధుల చేతులకు రాష్ట్రమిద్దామా? మళ్లీ పాత తెలంగాణ రోజులను తెచ్చుకుందామా చెప్పండని ప్రజానికాన్ని మంత్రి ప్రశ్నించారు.
ఉమ్మడి వరంగల్లో గులాబీ జెండా : ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంటుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 2000 పడకలతో.. వరంగల్లో సీఎం కేసీఆర్ దసరా రోజున ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని హర్షించారు. కోయగూడాలను, తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. ఒక్కరోజులోనే రూ.618 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు.
"ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. వరంగల్లో 24 అంతస్తులతో 2000 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. కోయగూడాలను, తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారు. రాష్ట్రంలో రాబందుల పాలన కావాలా? దోపిడీ పాలన కావాలా మీరే తేల్చుకోవాలి." -కేటీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
ఇవీ చదవండి :