ETV Bharat / state

త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి: వినయ్‌ భాస్కర్‌ - హన్మకొండ తాజా వార్తలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబెడ్కర్ జంక్షన్ సమీపంలో ఉన్న పండ్లు, పూల విక్రయ దుకాణాల ప్రాంగణంలో మున్సిపల్ అధికారులు, పలువురు వీధి వ్యాపారులతో కలిసి ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పర్యటించారు. రహదారి విస్తరణ పనుల్లో పనుల్లో జాప్యం చేయకుండా వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.

త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి: వినయ్‌ భాస్కర్‌

author img

By

Published : Aug 27, 2020, 7:47 AM IST

వీధి వ్యాపారుల భద్రత, సంరక్షణకు, సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబెడ్కర్ జంక్షన్ సమీపంలో ఉన్న పండ్లు, పూల విక్రయ దుకాణాల ప్రాంగణంలో మున్సిపల్ అధికారులు, పలువురు వీధి వ్యాపారులతో కలిసి పర్యటించారు.

అంబెడ్కర్ జంక్షన్ నుంచి బాల సముద్రం అంతర్గత రహదారి విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రహదారి విస్తరణ పనుల్లో పనుల్లో జాప్యం చేయకుండా వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. రహదారికి ఇరువైపుల ఉన్న షాపుల యజమానులు రోడ్డును సగం వరకు ఆక్రమించి తమ వ్యాపారాలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

వీధి వ్యాపారులు పోలిస్‌, మున్సిపల్‌ అధికారులకు సహకరించి.. నగర అభివృద్ధికి తోడ్పడాలని వినయ్‌ భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. నగర రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆటంకం కల్గకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలలో ప్రత్యేక జోన్లను ఏర్పాటుచేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీధి వ్యాపారుల హక్కులను కాపాడుతూ గౌరవప్రదంగా జీవించేందుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.