ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాలు నిర్వీర్యం అయ్యాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కల్పలత సూపర్ మార్కెట్‌ను తొలగించి ప్రభుత్వానికి కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చూశారన్నారు. ఆ ప్రతిపాదనను ఖండిస్తూ ఆరేళ్ల పాటు శ్రమించి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చామని తెలిపారు. 97వ అంతర్జాతీయ సహకార సంఘాల సదస్సులో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతకుముందు కల్పలత సూపర్ మార్కెట్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇవీ చూడండి: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం