కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లోని క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.
రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని వినయ్ భాస్కర్ తెలిపారు.