వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్లలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి బియ్యం, నూనె, పప్పులు అందజేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారని గుర్తు చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి