ETV Bharat / state

ERRABELLI: 'సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి' - cm kcr warangal tour news

వరంగల్​లో రేపు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్​లు పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం పర్యటించే ప్రదేశాలను మంత్రులు పరిశీలించారు.

'సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
'సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
author img

By

Published : Jun 20, 2021, 1:32 PM IST

వరంగల్‌లో రేపు సీఎం కేసీఆర్​ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​లు పరిశీలించారు. హన్మకొండలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. సమావేశ మందిరం, ఫర్నీచర్, ఎలక్ట్రిసిటీ పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.

కేసీఆర్​ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు. మంత్రుల వెంట ప్రభుత్వ చీఫ్‌ విప్, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు.

ఇదీ చూడండి: CM KCR : సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.