ప్రాణాలను పణంగా పెట్టి... కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను తీసుకొచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని... వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళుర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, తదితరులు... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉండి... అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం ద్వారా తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని గింజ కూడా వదలకుండా ప్రభుత్వం కొంటుంటే... భాజపా నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎర్రబెల్లి విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారని.. ఇక్కడి నాయకులు దీక్షలకు దిగారని ఆక్షేపించారు. కరోనా నియంత్రణలోనూ తెలంగాణ ఆదర్శంగా ఉందని చెప్పారు. అనంతరం పలువురికి నాయకులు మాస్కులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: తెరాస భవన్లో కేసీఆర్ పతాకావిష్కరణ