ETV Bharat / state

'అంబేడ్కర్​ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి' - MINISTER ERRABELLI DHAYAKER, KOPPULA EESHWAR INAUGURATED AMBEDKER STATUE

అంబేడ్కర్​ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, కొప్పుల ఈశ్వర్​ సూచించారు. వరంగల్​ అర్బన్​ జిల్లా ఎర్రబెల్లిలో నూతనంగా నిర్మించిన అబేడ్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

MINISTER ERRABELLI DHAYAKER, KOPPULA EESHWAR INAUGURATED AMBEDKER STATUE
MINISTER ERRABELLI DHAYAKER, KOPPULA EESHWAR INAUGURATED AMBEDKER STATUE
author img

By

Published : Dec 23, 2019, 1:30 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లిలో ఏర్పాటుచేసిన డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రులు కొనియాడారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకులల ద్వారా మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​ను మంత్రులు అభినందించారు. అంబేడ్కర్​ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని మంత్రులు వివరించారు.

'అంబేడ్కర్​ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి'

ఇదీ చూడండి:పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది!

Intro:TG_KRN_101_22_MANTHRULU_AMBEDKER_VIGRAHA AVISHKARANA_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ లు ఆవిష్కరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అందరివాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కరని, ప్రపంచ దేశాలు మన దేశ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.ఈ ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకులల ద్వారా మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభినందించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు దైవభక్తి ఎంత ముఖ్యమో, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో, పేదలను కూడా అంతే ప్రేమించాలన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వర్ధంతి లను నిర్వహించడం కాకుండా ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించి కొనసాగించాలన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు 204 రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలతో ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు 30 డిగ్రీ కళాశాలలను, ఎస్టీలకు 22 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఒకటవ తరగతి నుండి నాలుగోవ తరగతి వరకు కూడా గురుకులాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గురుకులల విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.Body:బైట్స్

1) ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తెలంగాణ
2) కొప్పుల ఈశ్వర్ విద్యాశాఖ మంత్రి తెలంగాణConclusion:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.