రాష్ట్ర ప్రభుత్వం ఏమి అడిగినా కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఏం చేశారని భాజపా అభ్యర్థులకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ హామీలు నెరవేర్చకపోగా... నిత్యావసరాల ధరలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ.. ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 150 ఎకరాలకు పైగా భూమి సేకరించి ఇచ్చినా... కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.
త్వరలో 50 వేల ఉద్యోగాలు..
ప్రజలకిచ్చిన హామీల్లో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతితో పాటు 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి: విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్