వరంగల్ భద్రకాళి అమ్మవారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఎంపీ సంతోశ్ కుమార్తో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు కలిసి మొక్కలను నాటారు. అర్చకులు ఆలయానికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేష వస్త్రాలను అందజేశారు.
ఇదీ చదవండి: నా మాటలు వక్రీకరించి... దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్