ముస్లింల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు స్థానిక ఎమ్మెల్యే వినయ్భాస్కర్తో కలిసి మంత్రి హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు సుబ్బారావు, కారం రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎన్నికల కమిషన్కు హైకోర్టు మొట్టికాయలు