ETV Bharat / state

కరోనాను ఎదుర్కొంటూనే చదువులో రాణించాలి: లయన్స్ క్లబ్

author img

By

Published : Apr 2, 2021, 1:39 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్​ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆల్ ఇన్ వన్ గైడ్స్​ను పంపిణీ చేశారు. కొవిడ్​ మహమ్మారిని వల్ల కలిగిన ఆటంకాలను ఎదుర్కొంటూనే విద్యలో రాణించాలని సూచించారు.

Lions Club charity distributed guides to tenth graders
పదో తరగతి విద్యార్థులకు గైడ్స్ పంపిణీ

కరోనాను ఎదుర్కొంటూనే విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనతో చదువులో రాణించాలని లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సూచించారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్​ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థులకు ఆల్​ ఇన్ వన్ గైడ్స్​ను పంపిణీ చేశారు.

పదో తరగతిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ఉన్నత చదువులకు తమ వంతు సాయం చేస్తామని రాయపర్తి ఎంపీపీ అనిమిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రంగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్​ క్లబ్​ సంస్థ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.