ETV Bharat / state

'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'

రక్తదాన శిబిరాల ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చని వరంగల్​ జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ పేర్కొన్నారు. నిట్​లో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పాలనాధికారి, సంస్థ సంచాలకులు ప్రారంభించారు.

'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'
'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'
author img

By

Published : Jan 8, 2020, 3:33 PM IST

'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'
జాతీయ యువజనోత్సవాలలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్​లో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నిట్ సంచాలకులు ఎన్వీ రమణ రావు ప్రారంభించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో రక్తదానం చేస్తున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని.. ఇటువంటి రక్తదాన శిబిరాల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు.

విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిట్ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని విద్యాసంస్థ సంచాలకులు రమణ రావు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది నిర్వహించిన రక్తదాన శిబిరంలో 1100 మంది విద్యార్థులు రక్తదానం చేయగా.. ఈ సంవత్సరం 1500 మంది రక్త దానం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన

Intro:TG_WGL_11_08_MEGA_BLOOD_DONATION_CAMP_IN_NIT_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) జాతీయ యువజనోత్సవాలలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో మెగా రక్త దాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నిట్ సంచాలకుడు ఎన్వి రమణ రావు ప్రారంభించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో రక్తదానం చేస్తున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని.... ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిట్ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని నిట్ సంచాలకుడు తెలిపారు. యువజనోత్సవాల లో భాగంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 1100 మంది విద్యార్థులు రక్తదానం చేశారని...... ఈ సంవత్సరం 1500 మంది రక్త దానం చేసే అవకాశం ఉందని తెలిపారు.

byte...

ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్.

ఎన్ వి రమణ రావు, నిట్ వరంగల్ సంచాలకుడు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.