ETV Bharat / state

'ఎన్నికల నగారా మోగబోతోంది.. పనుల్లో వేగం పెంచండి' - mayor meeting with wgl corporators

వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని, కావున పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ ప్రకాశ్ రావు తెలిపారు. వరంగల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

mayor-prakash-said-greater-warangal-works-tasks-must-be-completed-expeditiously
పనులు త్వరతగతిన పూర్తి చేయాలి: మేయర్​
author img

By

Published : Jan 16, 2021, 7:38 PM IST

పనులు త్వరతగతిన పూర్తి చేయాలి: మేయర్​

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో వరంగల్ మహనగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్‌ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్లు హజరయ్యారు.

ప్రభుత్వ ఛీప్​ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి సైకిల్​పై వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్‌ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వరంగల్‌ మేయర్ గుండా ప్రకాశ్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ నగర అభివృద్దికి నెలకు రూ.75 కోట్లు ఇస్తుందని మేయర్​ పేర్కొన్నారు. నగరంలో పార్కులు, శ్మాశాన వాటికలు, కమ్యూనిటీ హల్స్​కు నిధులు కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఆరో డివిజన్​లో ఐదు కోట్లతో స్పోర్ట్స్ క్లబ్‌ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. నేటి కౌన్సిల్లో 119 ఎజెండా అంశాలకు 155.11 కోట్ల రూపాయలతో 380 అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందన్నారు.

ఇదీ చూడండి : 'హామీలు నెరవేర్చాకే సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.