వరంగల్ నగరంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా శాంతినగర్‌లో నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు దీనిని ప్రారంభించారు. కరోనా వైరస్ కట్టడిని సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 2,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది నగర పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారని తెలిపారు. స్వీయ నియంత్రణ వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమని.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు నగరంలో గుర్తించిన 15 నో మూమెంట్ ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి.. రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!