ETV Bharat / state

వరంగల్​లో లాక్​డౌన్ అమలుకు కఠిన చర్యలు

author img

By

Published : May 22, 2021, 8:07 PM IST

వరంగల్​లో లాక్​డౌన్​ను పోలీసులు కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. అయితే నిత్యవసరాలు కొనడానికి 6 తరువాత ప్రజలు రోడ్లపైకి వస్తుండటంతో నగరంలో పలు చోట్ల రద్దీ నెలకొంటుంది.

 వరంగల్ లో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు
lock down in warangal

లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో... పోలీసులు అప్రమత్తమయ్యారు.

వరంగల్ నగరంలో లాక్​డౌన్ అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చే వాహనదారులను కట్టడి చేస్తున్నారు. పలు చోట్ల కేసులు నమోదు చేసి.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పలు చోట్ల రద్దీ..

వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లోని అన్ని కూడళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేశారు. వైద్యసేవలు...ఇతరత్ర అత్యవసర సేవల కోసం వచ్చినవారినే అనుమతించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన సడలింపుతో నగరంలో పలు చోట్ల రద్దీ నెలకొంది. ప్రజలు ఒకేసారి నిత్యావసర సరకులు, కూరగాయల కోసం ఇళ్ల నుంచి బయటకి రావడంతో... రద్దీ ఏర్పడింది. వరంగల్ గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ లాక్​డౌన్ పటిష్ఠంగా అమలు దిశగా చర్యలు తీసుకున్నామని వరంగల్ ఏసీపీ బాలస్వామి తెలిపారు.

ఇదీ చూడండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.