పశువులలో గాలికుంటు వ్యాధి నివారణకై విస్తృత టీకాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లిలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశువులకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా.. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలని వినయ్‌భాస్కర్ సూచించారు. పశువుల్లో వాతావరణాన్ని బట్టి వ్యాధులు వస్తాయని.. వ్యాధి బారిన పడకుండా పశువులను కాపాడుకోవాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 1 నుంచి మార్చి 1 వరకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణకై టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల