వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం జేఏసీ విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి జిల్లా నూతన కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న సీఎం కాన్వాయ్‌కు విద్యార్థులు అడ్డుపడ్డారు.
ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను పక్కకు లాగిపడేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫలితంగా కొన్ని క్షణాల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: KCR: వరంగల్‌లో కేసీఆర్.. కలెక్టరేట్ ప్రారంభం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ