ETV Bharat / state

KTR Warangal Tour : 'కేసీఆర్ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగిస్తారు' - KTR Speech at Kakatiya Mega Textile Park

Minister KTR Visits Warangal : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా కేసీఆర్ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల చిన్న రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ముఖ్యమంత్రి సారథ్యంలో పురోగమిస్తూ... దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 900 కోట్లతో నెలకొల్పనున్న కొరియా పరిశ్రమ యంగ్ వన్‌కు కేటీఆర్ భూమిపూజ చేశారు. స్థానికులకే 99 శాతం ఉపాధి అవకాశాలు రానున్నట్లు మంత్రి వెల్లడించారు.

ktr
ktr
author img

By

Published : Jun 17, 2023, 7:09 PM IST

Updated : Jun 17, 2023, 7:31 PM IST

కేసీఆర్ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగిస్తారు

KTR Interesting Comments in Warangal : ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగిస్తారని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలొస్తాయన్న మంత్రి బీఆర్ఎస్ విజయం ఖాయమైందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు. నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భవిష్యత్తులో మేడిన్ తెలంగాణగా మారుతుందని కేటీఆర్ వివరించారు.

వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్‌లో రూ.900 కోట్లతో నెలకొల్పనున్న కొరియా పరిశ్రమ యంగ్ వన్‌కు కేటీఆర్ భూమిపూజ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు యంగ్ వన్ పరిశ్రమ తరపున ప్రత్యేక అతిధిగా.. కొరియా రాయబారి చంగ్ జే బక్ భూమిపూజలో పాల్గొన్నారు. ఇక్కడ తయారైన దుస్తులు.. ప్రపంచ విపణికలోకి వెలుతాయని కేటీఆర్‌ తెలిపారు. టెక్స్‌టైల్ రంగంలోనూ, వ్యవసాయంలోనూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలుంటాయని ఆయన చెప్పారు.

KTR Speech at Warangal : మూడు వస్త్ర పరిశ్రమల్లో 99 శాతం స్ధానికులకే ఉద్యోగాలు దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితమే జౌళి పార్క్ నెలకొల్పినా.. కేంద్రం ఆలస్యంగా మేలుకొందని విమర్శించారు. ఈ క్రమంలోనే టెక్స్‌టైల్‌ పార్క్ నిర్మాణానికి భూములిచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా భూములు కోల్పొయిన వారికి.. ఆగస్టు 15 కల్లా వందగజాల స్ధలాలతో పట్టాలివ్వాలని స్ధానిక శాసనసభ్యుడు, అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

KTR Speech at Kakatiya Mega Textile Park : వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన చేస్తూ రూ.618 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆజంజాహి మిల్లు మైదానంలో.. రూ.80 కోట్లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశాయిపేటలో లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు అందించారు. కొత్తవాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని, నేతన్నల విగ్రహాలను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రూ.74 కోట్లతో నిర్మించనున్న అధునాతన బస్టాండ్ పనులకు శంకుస్ధాపన చేశారు. వరంగల్ స్మార్ట్.. ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు శంకుస్ధాపన చేశారు.

"కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. వరంగల్‌ జిల్లాలో వచ్చే 3 కంపెనీల వల్ల 33 వేల ఉద్యోగాలు వస్తాయి. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెస్తాం. వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం. యంగ్‌ వన్‌ కంపెనీలో మొత్తం 11 పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు అనేక విదేశాలకు వెళ్తాయి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. టెక్స్‌టైల్ రంగంలో మన కంటే బంగ్లాదేశ్‌, శ్రీలంక ముందున్నాయి." - కేటీఆర్‌, పరిశ్రమలశాఖ మంత్రి

ఇవీ చదవండి. KTR on Women Welfare Celebrations : 'ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం'

అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు.. కేసీఆర్ : కేటీఆర్

Last Updated : Jun 17, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.