గిరిజనుల ఆరాధ్యుడు సేవాలాల్ జయంతిని సెలవు దినంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాలని కేరళ ఐజీపీ లక్ష్మణ్ నాయక్ కోరారు. అన్ని వర్గాలకు ఇచ్చినట్టే తమ పండుగలకు తెలంగాణ సర్కారు 100 కోట్లు ప్రకటించాలని స్పష్టం చేశారు.
హన్మకొండలోని గుండ్ల సింగారంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఐజీపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతీ హిందువుకు గురువని, ఆయన చూపిన బాటలో పయనిస్తామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ల్లక్ష్మణ్ నాయక్ ఉద్యోగ రీత్యా కేరళ ఐజీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: వర్గల్ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి