ETV Bharat / state

దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​ - NRC

దేశ రక్షణ కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తే.. కొన్ని పార్టీలు అనవసర ఆందోళనలకు తెర లేపుతున్నాయని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా వరంగల్​లో చేపట్టిన  మహా ప్రదర్శనలో పాల్గొన్నారు.

karimnagar mp bandi sanjay on caa in warangal
దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​
author img

By

Published : Jan 8, 2020, 7:19 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన చేపట్టారు. జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగిన ఈ మహా ప్రదర్శనలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, భాజపా శ్రేణులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ముస్లింకు ఎలాంటి నష్టం లేదు

దేశ రక్షణ కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువస్తే... కొన్ని పార్టీలు అనవసర ఆందోళనలకు తెర లేపుతున్నాయని సంజయ్​ మండిపడ్డారు. ఓట్ల కోసం చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పారు.

దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​

ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్​ సమావేశం

Intro:Tg_wgl_03_08_maha_pradharshana_on_caa_ab_ts10077
Note: బైట్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బైట్ లైవ్ ద్వారా వచ్చింది గమనించి గలరు.

Body:పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన చేపట్టారు. జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హన్మకొండ లో వేయి స్థంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ఈ మహా ప్రదర్శనలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, భాజపా శ్రేణులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువస్తే ...కొన్ని పార్టీలు ఆందోళనకు తెర లేపుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం చెత్త రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై తెరాస ఇంతవరకు ఎందుకు వివరణ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కొత్త మంది పౌరసత్వం చట్టం గురుంచి తెలియకుండా ఏదోఏదో మాట్లాడుతున్నారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఎలాంటి నష్టం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మైనారిటీ ఓట్ల కోసం తెరాస పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.... బైట్
బండి సంజయ్, కరీంనగర్ ఎంపి.

Conclusion:maha pradharshana on caa
Note: బైట్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బైట్ లైవ్ ద్వారా వచ్చింది గమనించి గలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.