ETV Bharat / state

'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్' - mbbs seats

ఎంబీబీఎస్​, బీడీఎస్​ సీట్ల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నీట్​ మెరిట్​ ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయన్నారు.

kaloji health university vice chancellor karunakar reddy spoke on mbbs, bds seats allotment
'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్'
author img

By

Published : Nov 5, 2020, 7:15 AM IST

నీట్‌ మెరిట్‌ ఆధారంగానే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల కేటాయింపులు ఉంటాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్‌ అమలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. లేనివారిని ఓపెన్‌ కేటగిరీగా గుర్తిస్తామని చెప్పారు. బుధవారం వరంగల్‌ కేఎంసీలోని విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన మాట్లాడారు.

  • రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు ఆరు వేలమందికిపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి పీడీఎఫ్‌లో అప్లోడ్‌ చేయాలి. అప్లోడ్‌ చేయని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తాం. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితా విడుదల చేస్తాం.
  • నీట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అభ్యర్థులు పొరపాటున తెలంగాణకు బదులుగా ఇతర రాష్ట్రాల పేరు నమోదు చేసినప్పటికీ అందోళన వద్దు. నీట్‌ మెరిట్‌ కార్డు ర్యాంకును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం.
    * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అప్లోడ్‌ చేసిన ధ్రువపత్రాల ఆధారంగా లోకల్‌, నాన్‌ లోకల్‌ కేటగిరీ ధ్రువీకరిస్తాం.
  • రాష్ట్రంలో కొత్త కాలేజీలతో కలిపి మొత్తం 32 మెడికల్‌ కళాశాలల్లో 4,800 సీట్లు, 13 డెంటల్‌ కాలేజీలలో 1,240 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ అమల్లోకి వస్తే మరో 190 పెరుగుతాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,500, ప్రైవేటు కాలేజీల్లో 2,750 నాన్‌ మైనార్టీ సీట్లు, మైనార్టీ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నాయి. మైనార్టీ మెడికల్‌ కాలేజీల్లో ఇతర విద్యార్థుల ప్రవేశాలకు అనుమతిలేదు. అందులో 60% సీట్లు కన్వీనర్‌ కోటా కిందకు వస్తాయి.
  • అడ్మిషన్ల తర్వాత వ్యక్తిగతంగా అభ్యర్థుల నిజ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ప్రవేశాలకు అనుమతిస్తాం. ఆ పరిశీలనలో ధ్రువీకరణ పత్రాలు నకిలీవని తేలితే అడ్మిషన్‌ రద్దుచేస్తాం. వారిపై చర్యలు తీసుకుంటాం.
  • మొదటి రౌండ్‌లో సీటు వచ్చిన అభ్యర్థి వెంటనే సంబంధిత కాలేజీలో చేరాలి. లేదంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తాం. ఆలిండియా కోటాలో సీటు వచ్చిన వారు రాష్ట్రంలోని ఏ కాలేజీలో చదివినా, వారికి లోకల్‌గా పీజీకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులుండవు.
  • ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా తరగతులు సాగడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నాం అని ఉపకులపతి తెలిపారు. సమావేశంలో విశ్వవిద్యాలయం ఉప రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దొడ్డ రమేష్‌ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'హైదరాబాద్​ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.