ధనిక, పేద తేడా లేకుండా కరోనా ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ తన సత్తా చాటుతోంది. ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొవిడ్ బారిన పడ్డారు. ఆయన సిబ్బందిలో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు గన్మెన్లు, పీఏ, డ్రైవరు ఉన్నారు.
నిన్నటివరకు హోం ఐసోలేషన్‌లో ఉన్న కడియం శ్రీహరి... ప్రస్తుతం చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు వెళ్తున్నారు.