ETV Bharat / state

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా - jp nadda warangal tour

JP Nadda visited Warangal Bhadrakali temple భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్​ భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను ఆయనకు అందించారు.

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా

author img

By

Published : Aug 27, 2022, 4:40 PM IST

Updated : Aug 27, 2022, 4:58 PM IST

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా

JP Nadda visited Warangal Bhadrakali temple భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్​ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్, డీకే అరుణ​తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అర్చకులు నడ్డాకు అందించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జేపీ నడ్డాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. నడ్డా రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

అంతకుముందు నడ్డా శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో క్రికెటర్ మిథాలీరాజ్‌తో భేటీ అయ్యారు. దిల్లీ నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకున్న నడ్డా.. మిథాలీరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలకు లభిస్తున్న మద్దతుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్‌ను శాలువా కప్పి సన్మానించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

JP nadda meet Mithali raj మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ

ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

Last Updated : Aug 27, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.