విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. బతుకమ్మ పాటపై పిల్లల నృత్యం అలరించింది.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోపడతాయని నిట్ డైరెక్టర్ ఎన్.వీ రమణారావు అన్నారు. తెలంగాణకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు ప్రతిభను చాటుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. అందరికి చదువు అందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఇన్స్పైర్లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు 647 ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. వీటిలో అత్యుత్తమమైన వాటిని జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.