ETV Bharat / state

'స్పందించకుంటే ఇంటిముందే దహనం చేస్తాం' - నష్టపరిహారం

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు వరంగల్​ అర్బన్​ జిల్లా నర్సింగరావుపల్లి గ్రామస్థులు. శేషాల శ్రీనివాస్​ అనే ట్రాక్టర్​ డ్రైవర్​ పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. అయిష్టంతోనే బలవంతంగా యజమాని పని చేయించాడని బంధువులు ఆరోపిస్తూ ధర్నా చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే యజమాని ఇంటిముందే మృతదేహాన్ని దహనం చేస్తామని హెచ్చరించారు.

'స్పందించకుంటే ఇంటిముందే దహనం చేస్తాం'
author img

By

Published : Jun 26, 2019, 9:54 AM IST

'స్పందించకుంటే ఇంటిముందే దహనం చేస్తాం'
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లిలో విషాదం నెలకొంది. ట్రాక్టర్​ డ్రైవర్​ శేషాల శ్రీనివాస్.. తన యాజమాని వ్యవసాయ భూమిని దున్నడానికి సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం పొలం దున్నుతుండగా ట్రాక్టర్​ అదుపుతప్పి తలకిందులవగా.. ఇంజిన్​ కింది భాగంలో ఇరుక్కొని శ్రీనివాస్​ మృతి చెందాడు. శ్రీనివాస్​ భూమిని దున్నడానికి అయిష్టత చూపినా... మృతుడి యజమాని శేషాల రాజు బలవంతంగా పని చేయించుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని శ్రీనివాస్​ మృతదేహంతో యజమాని ఇంటిముందు ధర్నా నిర్వహించారు. ఓనర్​ స్పందించకపోతే శవాన్ని తన ఇంటిముందే దహనం చేస్తామని హెచ్చరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.