కాకతీయుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల చివరి రోజు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజల కోసం ఆలయం ఎదుట వాహనాలు బారులు తీరాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించనున్నారు.
ఇవీ చూడండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం