గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ఖరారు కావడం వల్ల అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతో పాటు మహిళా ఓటర్ల జాబితాపై సర్వేను ముమ్మరం చేశారు.
ఇంటింటి సర్వే పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులు సూచించగా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రేపటితో ఇంటింటి సర్వే ముగిస్తుందని... అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేస్తామని డీసీ జోనా తెలిపారు.
ఇదీ చదవండి: 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా కేసులు