నిరుపేద ఆర్యవైశ్య బాలికల కోసం వసతి గృహాన్ని నిర్మిస్తున్నామని వరంగల్ మేయర్ గుండా ప్రకాశరావు తెలిపారు. పట్టణంలోని 26 డివిజన్ పరిధిలో డాల్ఫిన్ గల్లీ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే భవనానికి ఆయన భూమి పూజ చేశారు. రాబోయే కాలంలో ఇది గొప్ప ఆస్తిగా మిగిలిపోతుందని అన్నారు.
వడ్డీరహిత డొనేషన్లపై వచ్చే ఆదాయంతో ప్రస్తుత భవన నిర్మాణం చేపడుతున్నామని మేయర్ తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో నిర్మించటం వల్ల ఏడాదిలోనే వారికి డబ్బులను తిరిగి చెల్లిస్తామని అన్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతోనే వసతి గృహాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. దీని వల్ల అనేక మంది నిరుపేద ఆర్యవైశ్య బాలికలకు లబ్ధి చేకూరుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.