ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పట్టణంలో హిజ్రాలు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జ్వాల స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో 200 మంది హిజ్రాలు పాల్గొన్నారు. బతకడం కోసం భిక్షాటన చేస్తామని.. ఓటు మాత్రం అమ్ముకోమని హిజ్రాలు నినాదాలు చేశారు.
నగరంలో ప్రతిసారి పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని.. ఈ సారి అందరూ ఓటు వేసి పెంచాలని కోరారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని హిజ్రాలు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్ పాట