వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెండో టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు పరీక్షలు, మరోవైపు వ్యాక్సినేషన్‌తో ఆరోగ్య కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి.
రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. తొలుత టీకాను నిరాకరించిన ప్రజలు ప్రస్తుతం ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ చదవండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు