ETV Bharat / state

బీభత్సం సృష్టించిన గాలివాన - గాలివాన బీభత్సం

వరంగల్​ పట్టణ జిల్లా కడిపికొండ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలులు తీవ్రంగా వీయడం వల్ల చెట్లు విరిగి ఇండ్లపై పడ్డాయి. కొన్ని చోట్లు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

heavy rainstorm in warangal urban district
బీభత్సం సృష్టించిన గాలివాన
author img

By

Published : May 18, 2020, 10:46 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వీచిన ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తీవ్రమైన గాలుల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగి ఇళ్లపైన పడగా.. మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయి దూరంగా పడ్డాయి.

పెద్దపెద్ద వృక్షాలు కూడా వేర్లతో సహా వీధులలోని రోడ్లపై కూలిపోయాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు కూడా తెగిపడడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇవీ చూడండి: సొంత రాష్ట్రాలకు పయనమవుతున్న వలసజీవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.