ETV Bharat / state

Rain: వరంగల్​లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులు - Warangal weather report

భారీ వర్షాల(Heavy rains)తో వరంగల్ జిల్లా తడిసిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రహదారులు జలమయమై కాలువలను తలపించాయి. వరంగల్​లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

rain
rain
author img

By

Published : Jun 9, 2021, 4:29 PM IST

వరంగల్ జిల్లా భారీ వర్షాల (Heavy rains)తో తడిసిముద్దైంది. అర్ధరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షం (Rain) పడగా తెల్లవారుజాము సమయంలో కుండపోత వాన కురిసింది. నగరంలోని రహదారులు జలమయమై కాలువలను తలపించాయి. కాజీపేట, హన్మకొండ, వరంగల్ లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. సమ్మయ్యనగర్, 100 ఫీట్ రోడ్, గోకుల్ నగర్, పోచమ్మకుంట, హౌజింగ్ బోర్డు కాలనీ, ఎస్ఆర్ నగర్, నాయుడు పెట్రోల్ పంప్, దీన్ దయాళ్ నగర్, పెరికవాడ, తదితర ప్రాంతాల్లో మోకాల్లోతుపైగా నీరు వచ్చి చేరింది.

వరదనీటితో నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి. వరంగల్- 2 బస్ డిపోలోకి భారీగా వర్షపు (Rain) నీరు వచ్చి చేరింది. స్టోర్ రూంలోకి మోకాల్లోతుపైగా నీరు వచ్చి చేరింది. ఆర్టీఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో భారీగా నీరు రోడ్లపైకి వచ్చి చేరగా చెరువులను తలపించాయి. డ్రెయిన్లు నిండిపోవడంతో వరదనీరు చాలా చోట్ల రోడ్లపైకి వచ్చి చేరింది. వరంగల్ అర్బన్ జిల్లా హసనపర్తి మండలం నాగారంలో 14 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.

హన్మకొండ, హసనపర్తి, కమలాపూర్, ఖిలావరంగల్ లో 11 నుంచి 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట, పరకాల, దామెర మండలాల్లో కూడా భారీ వర్షం (Heavy rains) కురిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.