గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించింది. ఉదయం నుంచి జోరుగా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది.
హన్మకొండ, కాజీపేట, వరంగల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. వాన నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి.
ఇదీ చూడండి: WEATHER REPORT: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు