వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని జూబ్లీ మార్కెట్లో శ్రీ అభయాంజనేయ స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు కోయ దొరల డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మహిళల కోలాటాలు, గణపతి హనుమాన్ వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జైశ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలు, భక్తి గీతాలతో రహదారులన్నీ మార్మోగాయి. జూబ్లీ మార్కెట్లోని దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం 50 సంవత్సరాలుగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మారిందని ఆలయ అర్చకులు జాగర్లమూడి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈరోజు 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర - sri abhayanjneya
హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని కాజీపేటలోని జూబ్లీ మార్కెట్లో హనుమాన్ ప్రతిమతో శోభాయాత్ర నిర్వహించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని జూబ్లీ మార్కెట్లో శ్రీ అభయాంజనేయ స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు కోయ దొరల డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మహిళల కోలాటాలు, గణపతి హనుమాన్ వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జైశ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలు, భక్తి గీతాలతో రహదారులన్నీ మార్మోగాయి. జూబ్లీ మార్కెట్లోని దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం 50 సంవత్సరాలుగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మారిందని ఆలయ అర్చకులు జాగర్లమూడి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈరోజు 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ జూబ్లీ మార్కెట్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి శోభాయాత్ర సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ప్రతిమతో నిర్వహించిన ఈ శోభాయాత్ర జూబ్లీ మార్కెట్, కాజీపేట్ చౌరస్తా, రహమత్ నగర్, బాపూజీ నగర్ వరకు సాగింది. శోభయాత్ర ముందు కోయ దొరల డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మహిళల కోలాటాలు, గణపతి హనుమాన్ వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జైశ్రీరామ్ జై హనుమాన్ వంటి నినాదాలు, భక్తి గీతాలతో రహదారులన్నీ మారుమోగాయి. ఆలయ అర్చకులు జాగర్లమూడి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ కాజీపేట జూబ్లీ మార్కెట్ లోని దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం గత 50 సంవత్సరాలుగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మారిందని తెలిపారు. మంగళవారం రోజున 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం, బుధవారం హనుమజ్జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
byte.....
జాగర్లమూడి శ్రీనివాస శర్మ, ఆలయ అర్చకులు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593