వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను భాజపా ప్రకటించింది. ఈ జాబితాలో 12 డివిజన్‌లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
ఇప్పటి వరకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. తొలి జాబితాలో 28 డివిజన్‌లకు, రెండో జాబితాలో 25 డివిజన్‌లకు, మూడో జాబితాలో 12 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్‌లకు గానూ 65 డివిజన్‌లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మరో డివిజన్‌కు సంబంధించిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.