ETV Bharat / state

Warangal Corporators : వరంగల్​ కార్పొరేటర్ల దందాపై ఈటీవీభారత్ కథనం.. విచారణకు మున్సిపల్ శాఖ ఆదేశం

author img

By

Published : Dec 6, 2021, 11:06 AM IST

Warangal Corporators: వరంగల్‌ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో ఏం జరుగుతోంది? కప్పం కట్టించుకుంటున్న కార్పొరేటర్లు ఎవరో విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌.. గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ ప్రావీణ్యను కోరారు. కార్పొరేటర్ల దందాపై ‘ఈనాడు- ఈటీవీ భారత్'​లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.

gwmc
gwmc

Warangal Corporators : భవన నిర్మాణ అనుమతుల్లో కప్పం కట్టించుకుంటున్న కార్పొరేటర్ల విషయమై విచారణ చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్యను ఆదేశించారు. కార్పొరేటర్ల వసూళ్లపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్.. సిటీ ప్లానర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. కార్పొరేటర్ల దందాపై ‘ఈనాడు, ఈటీవీ భారత్'​లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.

పదవులను అడ్డంపెట్టుకుని కొందరు కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. సెటిల్​మెంట్లు, దందాలతో నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వరంగర్​ నగర పాలక సంస్థ పరిధిలో పలువురి కార్పొరేటర్ల వ్యవహారం శైలిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాజీపేట ప్రాంతంలో ఓ భవన నిర్మాణ యజమానిని నగదు ఇవ్వాలంటూ ఇద్దరు కార్పొరేటర్లు జులుం ప్రదర్శించినట్లు తెలిసింది. వరంగల్ ప్రాంతంలో మరో ఇద్దరు కార్పొరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి పొందినా. కార్పొరేటర్లు తమవద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. వరంగల్ మహా నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లపై సామాజిక కార్యకర్తలు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. మరికొంతమంది విశ్వనాథ్ కాలనీలోని 50 అడుగుల రహదారిని కబ్జా చేసి కార్పొరేటర్ భవనాన్ని నిర్మించారు. గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆభవనాన్ని బల్దియా సిబ్బంది కూల్చి వేయగా.. అధికారంలోకి రాగానే ఆ కార్పొరేటర్ తిరిగి నిర్మాణాన్ని చేపట్టారు. 19వ డివిజన్​కు చెందిన మరో కార్పొరేటర్... చెరువు స్థలాన్ని కాజేసేందుకు కుయుక్తులు పన్నారు.

ఇదీ చూడండి:

Warangal Corporators : ఓరుగల్లులో ఇంతే! అనుమతులున్నా.. ఆమ్యామ్యా ఇవ్వాల్సిందే!

TS news: గుత్తేదార్ల అవతారం ఎత్తుతున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. ఇష్టారాజ్యంగా పనులు

TAGS : Warangal news , Warangal Corporators News , Warangal Corporators , Warangal Latest News , TS News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.