వరంగల్ నగరంలో ఓ చిత్రకారుడు అందమైన బొమ్మలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. వినోద్‌కి చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. హన్మకొండలోని పలు కూడళ్ల వద్ద 150 రూపాయలకు మనిషి బొమ్మ వేస్తూ నాలుగు పైసలు సంపాదించుకుంటున్నాడు. రోజుకు 5, 6 బొమ్మలు వేస్తానని చెబుతున్నాడు. వినోద్ ఆర్ట్‌కి స్థానికులు ఫిదా అవుతున్నారు. ఎంతో ఆసక్తితో తమ బొమ్మలను వేయించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తను మరింత అందమైన బొమ్మలు వేస్తూ రాష్ట్రానికి పేరు తీసుకొస్తానని చెబుతున్నాడు.
ఇవీ చూడండి: 'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్‌కు బెయిల్