ETV Bharat / offbeat

సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ : తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా" - దీని టేస్ట్ ముందు బిర్యానీ కూడా బలాదూర్!

రైస్​తో ఏదైనా స్పెషల్​గా ట్రై చేయాలనుకుంటున్నారా? - అయితే, ఈ సూపర్ టేస్టీ కుష్కా రెసిపీపై ఓ లుక్కేయాల్సిందే!

Tamilnadu Style Veg Kuska Recipe
Veg Kuska Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 7:50 PM IST

Tamilnadu Style Veg Kuska Recipe : బిర్యానీ.. ఈ పేరు చెప్పగానే చాలా మంది భోజన ప్రియుల నోట్లో నీళ్లూరతాయి. అలాంటి ఫుడ్ లవర్స్​​ కోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "తమిళనాడు స్టైల్ వెజ్ కుష్కా" రెసిపీ. ఇది చూడ్డానికి బిర్యానీలా ఉంటుంది. కానీ.. దీన్లో చికెన్, మటన్ వంటి వాటిని వాడము. అలాగే, ఎలాంటి కూరగాయలు అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలతో దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి రైస్ - ఒకటిన్నర గ్లాసు
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • బిర్యానీ ఆకులు - 2
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - 1 రెమ్మ
  • జీడిపప్పు పలుకులు - 2 టేబుల్​స్పూన్లు
  • ఫ్రైడ్ ఆనియన్స్ - 2 నుంచి 3 టేబుల్​స్పూన్లు
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • కారం - అరటీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బిర్యానీ మసాలా పౌడర్ - అరటీస్పూన్
  • పచ్చి బఠాణీ - 3 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నెయ్యి - 1 టీస్పూన్

మసాలా పేస్ట్ కోసం :

  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 4
  • యాలకులు - 2
  • సన్నని అల్లం ముక్కలు - కొన్ని
  • వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 15
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - పావు ముక్క
  • టమాటాలు - 2
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పుదీనా తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పెరుగు - 2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్​ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
  • నూనె కాస్త వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, సన్నని అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • అవన్నీ దోరగా వేగిన తర్వాత అందులో కాస్త పెద్ద సైజ్​లో తరుక్కున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి టమాటాలు సాఫ్ట్​గా మారే వరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని కలిపి పాన్​ని దింపుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న టమాటా మిశ్రమం, పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచం దోరగా వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా పొడి వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్​ని అందులో వేసుకొని కలిపి మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. నానబెట్టుకున్న బాస్మతి రైస్​ని వాటర్​ లేకుండా వడకట్టుకొని ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే, పచ్చిబఠాణీని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఎసరు కోసం మరిగించుకున్న వాటర్​ని రెండున్నర గ్లాసుల వరకు పోసుకొని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించుకోవాలి.
  • ఇక్కడ మీరు రైస్​ను ఏ గ్లాసుతో తీసుకున్నారో అదే కొలతతో వాటర్​ని తీసుకోవాలి. అలాగే నార్మల్ రైస్ తీసుకుంటే మూడు గ్లాసుల వరకు వాటర్​ని పోసుకోవాలి.
  • ఇక రైస్ కొంచం ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు మూత తీసి కొత్తిమీర తరుగు, నెయ్యి వేసుకొని మొత్తాన్ని మరోసారి కలిపి మూతపెట్టుకొని వాటర్ పూర్తిగా ఇగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్​ మీద ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక దింపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా రైస్" రెడీ!

ఇవీ చదవండి :

మీ పిల్లలు కరివేపాకు తినడం లేదా? - ఇలా రైస్​ చేసి పెడితే మెతుకు మిగల్చరు - పైగా ఆరోగ్యం కూడా!

పర్ఫెక్ట్​ లంచ్​ బాక్స్​ రెసిపీ "ఆమ్లా రైస్​" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.