ETV Bharat / state

వరదల వల్ల 12వందల కుటుంబాలు రోడ్డునపడ్డాయి: చీఫ్​ విప్​ - heavy rains

దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్​లో నమోదు కావడం వల్లే జిల్లాలో వరదలు వచ్చాయని ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​ అన్నారు. వరదల కారణంగా 12వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

government chief whip vinaybhakar spoke on warangal floods
వరదల వల్ల 12వందల కుటుంబాలు రోడ్డునపడ్డాయి: ప్రభుత్వ చీఫ్​ విప్​
author img

By

Published : Aug 29, 2020, 3:18 PM IST

వరంగల్‌ నగరంలో వచ్చిన వరదల కారణంగా 12వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని...కేంద్రప్రభుత్వం 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్,‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ డిమాండ్​ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి వరంగల్‌ నగరం అతలాకుతాలం అయిందన్నారు. దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్‌ జిల్లాలో కురిసిందని... ఇటువంటి వరదల విషయంలో భాజపా నాయకులు చిల్లర రాజకీయాలు మానుకొని కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ఆయన సూచించారు.

వరదల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకుండా ప్రజలను అదుకునే పనులు చేయాలన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని అదుకుంటామని చెప్పారు. ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 500 కోట్లు ప్రకటించేలా బాధ్యత తీసుకుని చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. అంతే కాని చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్​, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నిర్లక్ష్యం మరిచిపోయింది.. పై కప్పు ఊడిపడింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.