వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ యువకుడు హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన యువతితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరు ఒకే కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారి ఎంతో చనువుగా ఉండేవారు.
కొంతకాలం తర్వాత యువతి ఆ పెళ్లి చేసుకుందామని కోరగా.. సరేనని నమ్మబలికిన ఆ యువకుడు నగరంలో అద్దెకు ఉంటున్న గదికి యువతిని పలు మార్లు తీసుకెళ్లాడు. అవసరం తీరాక పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి అతనిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : డ్రగ్స్ కేసు డ్యాన్సర్ కిశోర్ శెట్టి అరెస్ట్