వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో గణపతి నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. నవరాత్రులు పూజలందుకున్న గణపయ్యను నిమజ్జనం చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలతో అలరించారు. స్థానిక రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థినుల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాజీపేట్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చూడండి : పాలతో వినాయక నిమజ్జనం..తరలొచ్చిన భక్తజనం..