వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి మిర్చి విక్రయించేందుకు రైతులు వస్తుంటారు. 2 రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తిరిగి ప్రారంభం కావడంతో మిర్చి బస్తాలతో కళకళలాడింది.
మార్కెట్లో తేజ రకం మిర్చి ధర రూ.13,651 పలికిందని అధికారులు తెలిపారు. వండర్ హాట్ ధర రూ.15,900, డీడీ రకం మిరప రూ.13,400 ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మిర్చి ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇదీ చదవండి: హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ