నిబంధనలకు విరుద్ధంగా తన వ్యవసాయ బావి పక్కనే మరో రైతు వేసిన బోరుబావిని తొలగించాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ కాజీపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వర్రావు అనే రైతు కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి విఫలయత్నం చేశాడు.
వ్యవసాయ బావి పక్కనే బోరు
రాజేశ్వర్రావు వ్యవసాయ బావికి సమీపంలోనే మరో రైతు బోరు వేయడంతో తన బావిలో నీరంతా ఇంకిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానికులు అడ్డుకొని కిరోసిన్ క్యాన్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి బోరుబావిని మూయించాలని రాజేశ్వర్రావు కోరుతున్నాడు.
ఇవీ చదవండి :కార్ల మంటలు ఆపేదెలా?